Nude Restaurant: ఆడ, మగ నగ్నంగా భోజనం చేసే వింత రెస్టారెంట్
Nude Restaurant: ప్రపంచవ్యాప్తంగా ఆహార ప్రియులను ఆకట్టుకునేందుకు ఎన్నో రకాల వినూత్న ఆలోచనలతో రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తుంటారు. సాధారణంగా ప్రత్యేకమైన వంటకాలు, విభిన్న అలంకరణలు, వినూత్న వాతావరణంతో కస్టమర్లను ఆకర్షించే రెస్టారెంట్లు కనిపిస్తుంటాయి. అయితే అమెరికాలోని ఓ రెస్టారెంట్ మాత్రం అందుకు పూర్తిగా భిన్నమైన విధానంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడ నిర్వహించే ప్రత్యేక విందులో పాల్గొనే వారు ఒంటిపై ఎలాంటి దుస్తులు లేకుండా ఒకచోట కూర్చుని భోజనం చేస్తారు. ఈ అసాధారణ విధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న 'క్లాస్ సోయిరీ స్టిక్ హాస్' అనే రెస్టారెంట్లో ప్రతి నెలా మొదటి సోమవారం ప్రత్యేకంగా 'బేర్ ఇట్ ఆల్'...