Hanumakonda District: ‘స్టార్ త్రినేత్రం’ కథనాలకు కదులుతున్న నెట్వర్క్!
వేలేరు తహశీల్దార్ కార్యాలయ ఆరోపణలపై పెరుగుతున్న చర్చ కథనాలపై ఆరా.. తమకూ అన్యాయం జరిగిందంటున్న ఇతర బాధితులు..? ఉన్నతాధికారులు స్పందించాలని ‘బాధితుల’ విజ్ఞప్తి Hanumakonda District: హనుమకొండ జిల్లా వేలేరు మండల తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలపై ‘స్టార్ త్రినేత్రం’లో ప్రచురితమైన కథనాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. కథనం వెలువడిన అనంతరం పలువురు ‘స్టార్ త్రినేత్రం’ను సంప్రదిస్తున్నారు. అదే సమయంలో తమకు కూడా ఇదే తరహాలో ఇబ్బందులు ఎదురయ్యాయని, ప్రభుత్వ కార్యాలయాల్లో కొన్ని పనుల కోసం అనవసర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మరికొందరు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తమ పేర్లు ప్రస్తుతం బయటకు వెల్లడించేందుకు ఇష్టపడకపోయినా, అవసరమైతే సంబంధిత ఆధారాలతో అధికారుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా...