Hanumakonda District: తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు

మధ్యవర్తిగా రికార్డ్ అసిస్టెంట్..! పట్టా కోసం ఎకరానికి రూ.10వేల డిమాండ్..? 3 ఎకరాలకు రూ.30 వేలు కోరినట్లు రైతుల ఆరోపణ గిఫ్ట్ డీడ్ పట్టాకు డబ్బుల డిమాండ్ కలకలం మేడం డబ్బులు అడుగుతున్నారని చెప్పిన రికార్డ్ అసిస్టెంట్ వేలేరు మండలంలో బయటపడ్డ 'డీల్' బాగోతం! అధికారుల వ్యవహారంపై 'స్టార్ త్రినేత్రం'ను సంప్రదించిన రైతులు Hanumakonda District: హనుమకొండ జిల్లా వేలేరు మండల తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. గిఫ్ట్ డీడ్ ఆధారంగా భూమికి పట్టా మంజూరు చేయించుకునేందుకు వచ్చిన రైతుల నుంచి ఎకరానికి రూ.10వేల చొప్పున డబ్బులు డిమాండ్ చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. మొత్తం 3 ఎకరాల భూమికి రూ.30 వేలు...