Warangal: లంచం ఇస్తే.. పట్టా..!
మధ్యవర్తిగా రికార్డ్ అసిస్టెంట్!.. ఎమ్మార్వో డీల్? Warangal: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ మండల రెవెన్యూ కార్యాలయంలో పట్టాల మంజూరు పేరుతో భారీ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన రైతులకు పారదర్శకంగా సేవలు అందించాల్సిన చోట కొంతమంది అధికారుల వ్యవహార శైలిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పట్టా సంబంధిత పనులు పూర్తి చేయించాలంటే తప్పనిసరిగా డబ్బు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారని పలువురు బాధిత రైతులు వాపోతున్నారు. రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించకుండా, ప్రక్రియ పేరుతో వారిని కార్యాలయం చుట్టూ తిప్పించి చివరికి లంచం డిమాండ్ చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో కార్యాలయంలో పనిచేస్తున్న ఓ...