Hanumakonda: జిల్లా అథ్లెటిక్స్ పోటీల్లో కేంబ్రిడ్జ్ విద్యార్థుల ప్రతిభ

60 మీటర్ల పరుగు, లాంగ్ జంప్‌లో ఆకట్టుకున్న విద్యార్థులు భవిష్యత్తులో జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్ష Hanumakonda: హనుమకొండ జిల్లాలో నిర్వహించిన జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో కేంబ్రిడ్జ్ మాంటిస్సోరి ఇంటర్నేషనల్ స్కూల్, గోపాలపూర్ విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ ప్రత్యేక గుర్తింపు పొందారు. హనుమకొండలోని జె.ఎన్.ఎస్. స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో పాఠశాలకు చెందిన 30 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. చిన్న వయసులోనే క్రీడలపై ఆసక్తిని పెంపొందించుకుంటూ పోటీల్లో ధైర్యంగా పాల్గొనడం పాఠశాల విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించిందని నిర్వాహకులు పేర్కొన్నారు. విద్యార్థులు 60 మీటర్ల పరుగుపందెం, లాంగ్ జంప్ విభాగాల్లో పోటీపడి తమ ప్రతిభను చాటుకోవడంతో పాటు...