Ghost Train: ట్రైన్ మొత్తం దెయ్యాలే.. ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్
Ghost Train: 2024లో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసిన కొరియన్ భయానక చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ఘోస్ట్ ట్రైన్ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు అందుబాటులోకి వచ్చింది. ప్రతి వారం మాదిరిగానే ఈసారి కూడా పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు డిజిటల్ వేదికల్లో సందడి చేస్తున్నాయి. తెలుగు చిత్రాలతో పాటు ఇతర భాషల సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ జాబితాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది ఘోస్ట్ ట్రైన్. థియేటర్లలో మంచి స్పందన అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగు భాషలో కూడా అందుబాటులో ఉండటంతో భయానక కథలను ఇష్టపడే సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. కేవలం గంటన్నర నిడివి ఉన్నప్పటికీ ఆద్యంతం ఉత్కంఠభరితంగా...