Rice test: మీరు తినే బియ్యంలో ప్లాస్టిక్ రైస్ కలిపినట్లు డౌట్ వచ్చిందా?

Rice test: మీ ఇంట్లో రోజూ అన్నం వండేటప్పుడు బియ్యం గింజలు కరిగిపోవడం, నీటిలో తేలిపోవడం, వండిన వెంటనే అతిగా మెత్తబడటం లేదా కొద్ది గంటల్లోనే పాడైపోవడం వంటి అనుభవాలు ఎదురవుతున్నాయా? అయితే చాలామందిలాగే మీకూ ఒక్కసారిగా ఒక అనుమానం రావడం సహజం. అసలు మనం తింటున్నది నిజమైన బియ్యమేనా? లేక ప్లాస్టిక్ రైస్ కలిసిపోయిందా? అన్న సందేహం ఇప్పుడు చాలా ఇళ్లలో చర్చగా మారుతోంది. మార్కెట్లో ప్లాస్టిక్ రైస్ అనే మాట వినగానే భయపడని వారు ఉండరు. ఆరోగ్యానికి తీవ్ర హానికరమనే ప్రచారంతో ఈ అంశం ఎప్పటి నుంచో ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు...