Magha Purnima 2026: ఈ రోజు ఇంట్లో పూజలు, దాన ధర్మాలు చేశారంటే..?
Magha Purnima 2026: మాఘ మాసం హిందూ సంప్రదాయంలో ప్రత్యేకమైన ఆధ్యాత్మికత కలిగిన మాసంగా భావించబడుతుంది. ఈ మాసంలో ప్రతి రోజు పవిత్రతను కలిగి ఉండగా, మాఘ పూర్ణిమ విశేష ప్రాముఖ్యత కలిగిన రోజు. శాస్త్రాలు, పురాణ గ్రంథాల ప్రకారం ఈ రోజు చేసే పవిత్ర స్నానం, ధార్మిక కార్యాలు మనిషి చేసిన పాపాలను శుభఫలాలతో తొలగిస్తాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో భక్తులు ఈ రోజును ఆచరించడానికి భారీగా ఏర్పాట్లు చేస్తారు. మాఘ పూర్ణిమ 2026 తేదీ.. వేద పంచాంగం ప్రకారం.. 2026లో మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం జరుపుకోబడుతుంది. ఉదయం 5:53 నుండి ఫిబ్రవరి 2వ తేదీ 3:39 వరకు పౌర్ణమి...