Bats: గబ్బిలాలు తలక్రిందులుగా ఎందుకు వేలాడుతాయంటే..?

Bats: ప్రకృతిలో ఉన్న జీవుల్లో గబ్బిలాలు చాలా విచిత్రమైనవిగా భావిస్తారు. మిగతా పక్షులతో పోలిస్తే వీటి జీవన విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. సాధారణంగా పక్షులు కొమ్మలపై నిలబడి విశ్రాంతి తీసుకుంటే, గబ్బిలాలు మాత్రం తలక్రిందులుగా వేలాడుతూ నిద్రపోతాయి. ఈ అలవాటు మొదట చూస్తే ఆశ్చర్యంగా అనిపించినా, అది వాటి శరీర నిర్మాణానికి అనుగుణంగా సహజంగా ఏర్పడిన ప్రక్రియ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గబ్బిలాలు ఎక్కువగా చీకటి, నిర్మానుష్య ప్రదేశాల్లో గుంపులుగా నివసిస్తాయి. గుహలు, చెట్ల కొమ్మలు, పాడుబడిన భవనాలు వీటికి ఇష్టమైన ఆశ్రయాలు. తలక్రిందులుగా వేలాడుతున్నప్పటికీ, వాటి శరీరంలో రక్త ప్రసరణ పూర్తిగా సజావుగానే కొనసాగుతుంది. మనుషులకు ఇలా వేలాడితే రక్తం తలకు చేరి...