Yaganti Temple: భక్తులను ఆశ్చర్యపరిచే నంది.. మనుషుల్లాగే విగ్రహం కూడా పెరుగుతుందట!

రాళ్లకు జీవం ఉంటుందా? అవి కూడా మనుషుల్లాగే పెరుగుతాయా? అనే ప్రశ్న సాధారణంగా ఎవరికైనా విచిత్రంగానే అనిపిస్తుంది. కానీ ఒక్కసారి యాగంటి క్షేత్రాన్ని దర్శిస్తే.. ఈ సందేహం సహజంగానే మనసులో ఉద్భవిస్తుంది. కారణం అక్కడ ఉన్న నంది విగ్రహమే. కాలక్రమేణా పెరుగుతున్నట్టు కనిపించే ఈ నంది విగ్రహం యాగంటి ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. భక్తుల విశ్వాసం, శాస్త్రీయ పరిశోధనలు, పురాణ గాథలు అన్నీ కలిసి ఈ క్షేత్రాన్ని ఒక మహా మిస్టరీగా నిలబెడుతున్నాయి. కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో ప్రకృతి అందాల నడుమ కొలువుదీరిన యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా పేరుగాంచింది. ఈ ఆలయానికి సంబంధించిన...