Malaika Arora: 19 ఏళ్ల చిన్నవాడితో 52 ఏళ్ల హీరోయిన్ డేటింగ్..!
Malaika Arora: ప్రేమకు, వివాహానికి వయసుతో సంబంధం లేదనే అభిప్రాయాన్ని పలువురు సినీ ప్రముఖులు తమ వ్యక్తిగత జీవితాల ద్వారా మరోసారి చర్చనీయాంశంగా మారుస్తున్నారు. కొందరు చిన్న వయసులోనే వివాహ బంధంలోకి అడుగుపెడితే, మరికొందరు చాలా ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారు. అలాగే తమకంటే పెద్దవారిని లేదా చిన్నవారిని జీవిత భాగస్వాములుగా ఎంచుకున్న సినీ ప్రముఖులు కూడా చాలామంది ఉన్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటి మలైకా అరోరా వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ఒక వివాహం ముగియడం, అనంతరం మరో ప్రేమ బంధానికి కూడా ముగింపు పలకడం తర్వాత ఇప్పుడు మరో వ్యక్తితో ఆమె సన్నిహితంగా కనిపిస్తున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా...