Inspirational Story: 21 ఏళ్లకే పెళ్లి.. 23 ఏళ్లకే తల్లి.. తండ్రి కలను నెరవేర్చిన ఐఏఎస్

Inspirational Story: పట్టుదల, క్రమశిక్షణ, లక్ష్యసాధనపై అచంచలమైన నమ్మకం ఉంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా అధిగమించి అనుకున్న గమ్యాన్ని చేరుకోవచ్చని ఐఏఎస్ అధికారిణి మిన్ను పి.ఎం.జోషి జీవిత ప్రయాణం మరోసారి చాటిచెబుతోంది. ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు, చిన్నారి సంరక్షణ వంటి ఎన్నో సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూనే సివిల్ సర్వీసెస్ వంటి అత్యంత కఠినమైన పరీక్షలో విజయం సాధించిన ఆమె కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమవుతోంది. ఎన్నో ఆటంకాలు ఎదురైనా లక్ష్యాన్ని వదులుకోకుండా నిరంతర శ్రమతో ముందుకు సాగితే విజయం తప్పకుండా సొంతమవుతుందనే సందేశాన్ని ఆమె జీవిత గాథ అందిస్తోంది. కేరళలోని పత్తనంతిట్టకు చెందిన మిన్ను పి.ఎం.జోషి చిన్న వయసులోనే తన తండ్రిని...