New Rules: ఆగస్టు 1 నుంచి మారనున్న కొత్త నిబంధనలు ఇవే..

New Rules: ఆగస్టు నెల ప్రారంభంతో దేశవ్యాప్తంగా సామాన్య ప్రజల జీవితాలపై ప్రభావం చూపే పలు కీలక నిబంధనలు అమల్లోకి రానున్నాయి. బ్యాంకింగ్, రైల్వే టికెట్ బుకింగ్, పెట్టుబడులు, ఎల్పీజీ సిలిండర్ ధరలు, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వ రవాణా సేవలు వంటి అనేక రంగాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా వినియోగదారుల గుర్తింపు ప్రక్రియను మరింత సులభతరం చేసే కొత్త కేవైసీ విధానం, రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో కొత్త టోకెన్ విధానం, బ్యాంకుల సేవా రుసుముల్లో మార్పులు, షేర్ల బైబ్యాక్ నిబంధనల్లో సవరణలు అమల్లోకి రానుండటంతో ప్రజలు ఈ మార్పులపై ముందుగానే అవగాహన కలిగి ఉండటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతినెల మాదిరిగానే ఆగస్టు 1న...