Health Update: నిలకడగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం
వైద్యుల కీలక ప్రకటనతో ఊరట అవాస్తవ ప్రచారాలు నమ్మొద్దన్న వైద్యులు మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు రోహిణి ఆసుపత్రి నుంచి హైదరాబాద్కు తరలింపు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఊరట Health Update: బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు మరోసారి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, సోషల్ మీడియాలో, కొన్ని వెబ్సైట్లలో ప్రచారంలో ఉన్న అవాస్తవ వార్తలను ఎవరూ నమ్మవద్దని స్పష్టం చేశారు. గుండెపోటుతో అస్వస్థతకు గురైన వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా, వైద్య బృందం అత్యవసరంగా సీపీఆర్తో పాటు అవసరమైన చికిత్స...