Ek Din: మీకు తెలుసా?.. అందరూ ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారట!

Ek Din: ప్రస్తుతం ఓటీటీ వేదికలపై సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా సస్పెన్స్, భయానక, ఉత్కంఠభరిత, ప్రేమకథా చిత్రాలకు విశేష ఆదరణ లభిస్తోంది. థియేటర్లలో భారీ అంచనాల నడుమ విడుదలై ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన ఎన్నో సినిమాలు తర్వాత ఓటీటీలో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కొత్త జీవితాన్ని పొందుతున్నాయి. అలాంటి జాబితాలో ఇప్పుడు మరో చిత్రం చేరింది. 2026 మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఏక్ దిన్’ చిత్రం థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయినా, ఇప్పుడు ఓటీటీలో మాత్రం అనూహ్యమైన ఆదరణను సొంతం చేసుకుంటూ ట్రెండింగ్ జాబితాలో చోటు దక్కించుకుంది. ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ నిర్మాణ సంస్థ నిర్మించిన...