PNB: ఈ బ్యాంకు ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా..?
PNB: పంజాబ్ నేషనల్ బ్యాంక్ దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు శుభవార్త అందించింది. బ్యాంకులోని హ్యూమన్ రీసోర్సెస్ విభాగం వివిధ రాష్ట్రాల్లోని శాఖల కోసం మొత్తం 545 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న అర్హులైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు. ఈ నియామకాలలో ఆంధ్రప్రదేశ్‌కు 4 పోస్టులు, తెలంగాణకు 41 పోస్టులు కేటాయించారు. అలాగే గుజరాత్లో 77, కర్ణాటకలో 78, మహారాష్ట్రలో 67, తమిళనాడులో 51, పశ్చిమ బెంగాల్లో 80, జమ్మూ అండ్ కాశ్మీర్లో 9, లద్దాఖ్‌లో 2, అరుణాచల్ ప్రదేశ్‌లో 4, అస్సాంలో 85, మణిపుర్లో 6, మేఘాలయలో 8,...