Bumper Offer: ఫ్రీగా ఫ్లైట్ ఎక్కే ఛాన్స్

Bumper Offer: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే మహోత్సవంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని కేవలం ప్రభుత్వ అధికారిక వేడుకగా కాకుండా ప్రజలందరూ భాగస్వాములు అయ్యే ప్రజల పండుగగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం పలు కీలక సూచనలు చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కోసం భూములు అందించిన రైతులు, భూ యజమానుల సేవలను ప్రభుత్వం ఎన్నటికీ మరవదని స్పష్టం చేసిన ఆయన, వారి త్యాగానికి...