Eega Mallesham: తపాల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

Eega Mallesham: హన్మకొండ పట్టణంలోని జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఆదివారం ఆలిండియా గ్రామీణ తపాల ఉద్యోగుల సంఘం 7వ ద్వైవార్షిక మహాసభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఖాదీ, చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం ముఖ్య అతిథిగా హాజరై సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా అఖిల భారత గ్రామీణ తపాల ఉద్యోగుల సంఘానికి వరుసగా 2వసారి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన బొద్దున వెంకటేశ్వర్లును శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయిలో మరోసారి బాధ్యతలు చేపట్టడం గ్రామీణ తపాల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మరింత బలాన్నిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఈగ మల్లేశం.....