Wardhannapet: అభయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.10 వేలు నగదు బహుమతి
Wardhannapet: వర్ధన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రతిభ కనబరిచే విద్యార్థులను ప్రోత్సహిస్తూ అభయ చారిటబుల్ ట్రస్ట్ మరోసారి తన విద్యా సేవా కార్యక్రమాన్ని శనివారం కొనసాగించింది. 1987–88 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, వర్ధన్నపేటలో పదవ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు స్థాపించిన ఈ ట్రస్ట్ గత 5 సంవత్సరాలుగా పాఠశాలలో పదవ తరగతి వార్షిక పరీక్షల్లో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థిలను సత్కరిస్తూ నగదు ప్రోత్సాహకాన్ని అందజేస్తోంది. విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంపొందించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారికి మరింత ఉత్సాహాన్ని కలిగించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది నిరంతరంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది నిర్వహించిన ఎస్ఎస్సీ-2026 వార్షిక...