Hyderabad: పిల్లలున్నా పెళ్లిచేసుకుంటానని.. మోజు తీరాక బ్లాక్!

Hyderabad: హైదరాబాద్‌లో పెళ్లి పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహం చేసుకుంటానని నమ్మకం కల్పించి శారీరక సంబంధం కొనసాగించిన అనంతరం రెండుసార్లు గర్భం దాల్చిన బాధితురాలికి గర్భస్రావ మాత్రలు ఇచ్చాడని, ఆ తర్వాత ఆమెను పూర్తిగా దూరం పెట్టి మరో యువతిని వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడని ఆరోపిస్తూ ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, బంజారాహిల్స్‌కు చెందిన 28 ఏళ్ల మహిళకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయం తెలిసినప్పటికీ ఫిల్మ్‌నగర్‌కు చెందిన రంజన్ కుమార్ ఆమెను...