Telangana: న్యాయం కోసం పోలీస్ స్టేషన్ వెళ్తే.. మహిళను గర్భవతిని చేసిన సీఐ

Telangana: ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఓ సీఐపై నమోదైన కేసు తీవ్ర సంచలనం రేపింది. వివాహ సమస్యతో పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించిన ఓ వివాహిత మహిళకు న్యాయం చేస్తానని నమ్మకం కల్పించి, తర్వాత పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఆమెను మోసం చేశాడని, లైంగికంగా, మానసికంగా వేధించడమే కాకుండా గర్భస్రావానికి కూడా కారణమయ్యాడని ఆరోపిస్తూ సీఐ బానోత్ రాజు నాయక్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా, ఈ ఘటన పోలీస్ శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. అధికారికంగా నమోదైన ఆరోపణలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఫిర్యాదులో పేర్కొన్న...