Interesting Fact: నిందితుల ముఖానికి పోలీసులు ముసుగు ఎందుకు వేస్తారు..?

Interesting Fact: పోలీసులు నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత వారి ముఖాలను గుడ్డ లేదా ముసుగుతో కప్పి మీడియా ముందుకు తీసుకురావడం తరచూ కనిపించే దృశ్యమే. అయితే దీనికి వెనుక చట్టపరమైన, మానవ హక్కులకు సంబంధించిన ముఖ్యమైన కారణం ఉంది. ఎవరైనా వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారంటే అతడు నేరం చేసినట్లు తుది నిర్ణయం అయిపోయిందని అర్థం కాదు. విచారణ పూర్తై, కోర్టులో నేరం రుజువై శిక్ష పడే వరకు చట్టం దృష్టిలో ప్రతి ఒక్కరూ నిర్దోషులుగానే పరిగణించబడతారు. ఈ నేపథ్యంలో నిందితుడి ముఖాన్ని బహిరంగంగా చూపించడం వల్ల అతని వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ విచారణ అనంతరం అతడు నిర్దోషిగా...