Gold Rivers: ఇక్కడ బంగారం ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ

Gold Rivers: బంగారం ధరలు రోజురోజుకూ కొత్త గరిష్ఠాలను నమోదు చేస్తుండటంతో సామాన్యుల నుంచి పెట్టుబడిదారుల వరకు అందరి దృష్టి పసిడిపైనే నిలుస్తోంది. ఇలాంటి సమయంలో ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో నదుల ఇసుకలోనే సహజసిద్ధంగా బంగారం లభిస్తుందనే విషయం ఆసక్తిని కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా బంగారం రేణువులు లభించే ప్రధాన నదులు మొత్తం 4 ఉన్నాయని చెబుతుంటారు. వాటిలో 2 భారతదేశంలో ఉండటం మరింత విశేషం. ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ప్రతిరోజూ నదిలోని ఇసుకను సేకరించి వడపోసి అందులోని సూక్ష్మ బంగారం రేణువులను వేరు చేసి విక్రయించడం ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. ఎలాంటి భారీ పెట్టుబడి లేకుండా కేవలం శ్రమతోనే విలువైన బంగారాన్ని సేకరించడం...