Dating Apps: ముసలోడి అరాచకం.. 14 మంది మహిళలను రేప్ చేశాడు!
Dating Apps: 68 ఏళ్ల వయసులో ప్రశాంతంగా జీవితం గడపాల్సిన ఓ వ్యక్తి చేసిన దారుణాలు జర్మనీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆన్లైన్లో పరిచయాలు ఏర్పరుచుకునే మహిళలను లక్ష్యంగా చేసుకుని వరుసగా లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 68 ఏళ్ల వ్యక్తిపై జర్మనీ అధికారులు అధికారికంగా అభియోగాలు నమోదు చేశారు. డేటింగ్ యాప్‌ల ద్వారా మహిళలకు దగ్గరవుతూ నమ్మకం సంపాదించి, అనంతరం వారికి తెలియకుండా మత్తు మందులు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసి లైంగిక దాడులకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ప్రస్తుతం ఈ కేసు జర్మనీ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దర్యాప్తు వివరాల ప్రకారం బెర్లిన్‌కు చెందిన నిందితుడు డేటింగ్ యాప్‌ల ద్వారా...