Central Government: ఇక అమ్మాయిల పెళ్లి వయసు 21 ఏళ్లు..?
Central Government: మారుతున్న సామాజిక పరిస్థితులు, మహిళల విద్యా స్థాయి, ఉపాధి అవకాశాలు, ఆరోగ్య సూచికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. దేశంలో మహిళల కనీస వివాహ వయసును ప్రస్తుతం అమల్లో ఉన్న 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచే అంశంపై మరోసారి కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. ఇటీవల వెలువడిన పలు సర్వేలు, రాబోయే జనగణన గణాంకాలను ఆధారంగా చేసుకుని ఈ మార్పుపై ప్రభుత్వం సమగ్రంగా పరిశీలన జరుపుతోంది. వివాహ వయసు పెంపు ద్వారా మహిళలకు ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు మరింత అందుబాటులోకి రావడంతో పాటు ఆరోగ్య పరంగా కూడా ప్రయోజనాలు కలుగుతాయని ప్రభుత్వ...