Cheapest Electric Car: హాట్ కేకుల్లా అమ్ముడవుతోన్న బుజ్జి ఎలక్ట్రిక్ కార్

Cheapest Electric Car: పెరుగుతున్న ఇంధన ధరలు సాధారణ వాహనదారులపై భారీ భారం మోపుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో కొత్త కారు కొనాలనుకునే వారు కూడా ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతున్నారు. అదే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన వాహన తయారీ సంస్థ వులింగ్ అందుబాటు ధరలో అందిస్తున్న హాంగ్ గ్వాంగ్ మినీ ఈవీ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. అత్యంత తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా నిలిచిన ఈ వాహనం నగర ప్రాంతాల్లో రోజువారీ ప్రయాణాలకు అనువైన ఎంపికగా మారింది. చిన్న కుటుంబాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ కారు...