Spirituality: నవగ్రహాల ప్రదక్షిణ అనంతరం కాళ్లు కడుక్కోవాలా..?
Spirituality: వైష్ణవ ఆలయాలను సందర్శించే భక్తుల్లో చాలామందికి తరచూ కలిగే సందేహం ఏమిటంటే.. శివాలయాలు, అమ్మవారి ఆలయాలు, ఇతర దేవాలయాల్లో నవగ్రహ మండపాలు కనిపిస్తుంటే, చాలా వైష్ణవ ఆలయాల్లో మాత్రం నవగ్రహ విగ్రహాలు ఎందుకు ఉండవు అనే ప్రశ్న. హిందూ ధర్మంలో సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహు, కేతువు అనే నవగ్రహాలకు విశేష ప్రాధాన్యం ఉంది. జ్యోతిష్య సంప్రదాయం ప్రకారం ఈ గ్రహాలు మనిషి జీవితంలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, వివాహం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం వంటి అనేక అంశాలపై ప్రభావం చూపుతాయని విశ్వసిస్తారు. అందువల్ల ఆలయాలకు వెళ్లే భక్తులు ప్రధాన దేవతను దర్శించడంతో పాటు నవగ్రహాలకు కూడా...