Thunderbolt Logic: పిడుగులు ఎక్కువగా మగవారిపైనే ఎందుకు పడతాయి..?

Thunderbolt Logic: వర్షాకాలంలో పిడుగుపాట్లు అనేక ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న గణాంకాలను పరిశీలిస్తే పిడుగుపాటుకు గురయ్యే వారిలో అత్యధికంగా పురుషులే ఉన్నట్లు పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. దీంతో చాలామందిలో పిడుగులు ఎందుకు ఎక్కువగా పురుషులపైనే పడుతున్నాయనే సందేహం తలెత్తుతోంది. అయితే దీనికి శరీర నిర్మాణం, లింగ భేదం లేదా ప్రకృతి ఎలాంటి వివక్ష చూపడం కారణం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జీవనశైలి, ఉపాధి, ప్రమాదాల పట్ల వ్యవహరించే తీరు వంటి అంశాలే ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. వ్యవసాయం, భవన నిర్మాణ పనులు, విద్యుత్ లైన్ల మరమ్మతులు, పశువుల సంరక్షణ, రహదారి పనులు, ఇతర బహిరంగ వృత్తుల్లో ఎక్కువగా పురుషులే పనిచేస్తుంటారు....