Government Schemes: ఈ పని చేయకపోతే పీఎం కిసాన్ నగదు కట్

Government Schemes: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హులైన రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది మొత్తం రూ.6,000 ఆర్థిక సహాయాన్ని 3 సమాన వాయిదాల రూపంలో అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి విడతలో రూ.2,000 చొప్పున నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. అయితే ఇటీవల విడుదలైన 23వ వాయిదా మొత్తం చాలా మంది రైతుల ఖాతాల్లో జమ కాలేదు. దీంతో పలువురు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పరిస్థితిలో భయపడాల్సిన అవసరం లేదని అధికారులు సూచిస్తున్నారు. చాలా సందర్భాల్లో చిన్నచిన్న సాంకేతిక లోపాలు, పత్రాల్లో పొరపాట్లు లేదా ఖాతా వివరాల్లో ఉన్న తేడాల వల్ల చెల్లింపులు...