Skin Care Alert: ఈ చిన్న తప్పులు ఆపకపోతే ముసలితనం రావడం గ్యారెంటీ!

Skincare Alert: చర్మం అందంగా, యవ్వనంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం ఖరీదైన ఉత్పత్తులు ఉపయోగించడం లేదా ప్రత్యేక చికిత్సలు తీసుకోవడం మాత్రమే సరిపోదు. మన రోజువారీ జీవనశైలిలో చేసే కొన్ని చిన్న పొరపాట్లు కూడా చర్మంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. చాలామందికి తెలియకుండానే అలవాటుగా మారిన కొన్ని చర్యలు చర్మంలోని సహజ కాంతిని తగ్గించి, వయసు కంటే ముందే ముడతలు కనిపించే పరిస్థితిని తీసుకువస్తాయి. ఆహారం, నిద్ర, నీరు, ఎండలో తిరిగే విధానం, మొబైల్ వినియోగం వంటి అంశాలు చర్మ ఆరోగ్యంతో నేరుగా ముడిపడి ఉంటాయి. అందుకే మంచి అలవాట్లను అలవరచుకోవడం ద్వారా చాలా కాలం పాటు చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుకోవచ్చని...