Temple Meditation: దేవాలయంలో ధ్యానం చేస్తే ఎందుకు ప్రశాంతంగా ఉంటుందంటే..?
Temple Meditation: దేవాలయానికి వెళ్లినప్పుడు చాలా మంది మనసులో ఒక ప్రత్యేకమైన ప్రశాంతత, ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని చెబుతుంటారు. ముఖ్యంగా ప్రాచీన దేవాలయాలు, శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు వంటి పవిత్ర క్షేత్రాలను దైవిక శక్తి నిలయాలుగా భక్తులు విశ్వసిస్తారు. అలాంటి ప్రదేశాల్లో కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చొని ధ్యానం చేయడం వల్ల మనసులో పేరుకుపోయిన ఒత్తిడి, ఆందోళన క్రమంగా తగ్గి అంతర్గత ప్రశాంతత పెరుగుతుందని ఆధ్యాత్మిక వర్గాలు పేర్కొంటున్నాయి. నిత్య జీవితంలో ఎదురయ్యే హడావిడి, మానసిక అలసట నుంచి కొంత సమయం దూరంగా ఉండి పవిత్ర వాతావరణంలో గడపడం ద్వారా మనసు స్థిరపడటంతో పాటు సానుకూల ఆలోచనలు పెరుగుతాయని విశ్వాసం ఉంది. అందుకే చాలామంది దేవాలయ దర్శనంతో పాటు...