AI video: వాట్సాప్ స్టేటస్‌లో నకిలీ వీడియో వైరల్!.. కట్ చేస్తే..
AI video: ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది తమ అసలు జీవన పరిస్థితులకు భిన్నంగా విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు చూపిస్తూ ఇతరులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అలాంటి ప్రదర్శనలు కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలకు దారితీస్తాయని మహారాష్ట్రలోని నాగపూర్‌లో జరిగిన ఒక ఘటన స్పష్టం చేసింది. కేవలం ధనవంతుడిగా కనిపించాలనే ఉద్దేశంతో ఒక వ్యక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగించి నకిలీ వీడియో రూపొందించడం చివరకు అతడికే పెద్ద సమస్యగా మారింది. అతను రూపొందించిన వీడియో కారణంగా సొంత స్నేహితుడే అతని ఇంటిపై దోపిడీకి పాల్పడటం స్థానికంగా సంచలనంగా మారింది. నాగపూర్‌కు చెందిన బాధితుడు...