Lord Vishnu: యోగిని ఏకాదశి రోజున చేయకూడని పనులు..
Lord Vishnu: యోగిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఏకాదశులలో ఒకటిగా భావించబడుతుంది. ప్రతి సంవత్సరం వచ్చే 24 ఏకాదశుల్లో జ్యేష్ట మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఈ ఏకాదశికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. అధిక మాసం ఉన్న సంవత్సరాల్లో మొత్తం 26 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశి కూడా శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడిన పవిత్రమైన ఉపవాస దినంగా పరిగణించబడుతుంది. దృక్ పంచాంగం ప్రకారం ఈ ఏడాది యోగిని ఏకాదశి వ్రతాన్ని జూలై 10, శుక్రవారం భక్తులు ఆచరించనున్నారు. ఈ రోజున నియమ నిష్ఠలతో ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే తెలిసీ తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయని, కుటుంబంలో...