Hanamkonda: లోకాన్ని వీడిన పవన్ అభిమాని నిరంజన్

Hanamkonda: అభిమానుల పట్ల తనకున్న అనుబంధాన్ని మరోసారి చాటుకున్న జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన ఓ ఆప్యాయ భేటీ ఇప్పుడు విషాద జ్ఞాపకంగా మారింది. స్టార్ హీరోగా కాకుండా కుటుంబ సభ్యుడిలా ఓ అభిమాని ఇంటికి వెళ్లి అతనికి ధైర్యం చెప్పిన పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నెరవేరకముందే ఆ అభిమాని కన్నుమూయడం అభిమానులను తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తోంది. అనారోగ్యంతో మంచానికే పరిమితమైన బాలుడి చేతిని పట్టుకుని అతనిలో ధైర్యం నింపేందుకు ప్రయత్నించిన పవన్ కళ్యాణ్, త్వరలో కలిసి OG-2 సినిమా చూద్దామని, సినిమా విడుదలయ్యే సమయానికి తన ప్రత్యేక అతిథిగా ఉండాలని హామీ ఇచ్చారు....