NEET-UG: పేపర్ లీక్ల తర్వాత కీలక నిర్ణయం
NEET-UG: దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్షను మరింత పారదర్శకంగా, సురక్షితంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్తో పాటు ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ పరీక్షను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకోసం దేశంలోని సుమారు 500 నగరాల్లో దాదాపు 1,000 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి, పరీక్షను ఒకే రోజు కాకుండా 5 నుంచి 6 రోజుల పాటు విడతలవారీగా నిర్వహించే ప్రణాళిక సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ విధానం అమల్లోకి వస్తే ఒకే రోజు పరీక్ష...