Telangana: 2 కిలోల బంగారం.. కోట్ల ఆస్తులు.. డీఎస్పీ చిట్టా చాంతాండంత..!

Telangana: ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన ఆరోపణల కేసులో హైదరాబాద్‌లోని పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న భీమ్‌రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు చర్యలను మరింత వేగవంతం చేశారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన భీమ్‌రెడ్డి ఆరోగ్యం మెరుగుపడిన వెంటనే అధికారులు ఆయనను అదుపులోకి తీసుకుని ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారణ కొనసాగించారు. తర్వాత న్యాయమూర్తి నివాసంలో భీమ్‌రెడ్డిని హాజరుపరచగా, కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు భీమ్‌రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో వెలుగులోకి వస్తున్న అంశాలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. కొద్ది రోజుల...