Marriage Age: అబ్బాయికి 28.. అమ్మాయికి 26 ఏళ్లు..!

Marriage Age: భారతదేశంలో వివాహ వ్యవస్థ కాలానుగుణంగా వేగంగా మారుతోంది. ఒకప్పుడు యుక్తవయసు వచ్చిన వెంటనే వివాహం చేయడం కుటుంబాల్లో ఆనవాయితీగా ఉండేది. అయితే ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థిరత్వం, వ్యక్తిగత లక్ష్యాలకు ప్రాధాన్యం పెరగడంతో యువత పెళ్లి నిర్ణయాన్ని మరింత ఆలోచించి తీసుకుంటోంది. కెరీర్‌లో స్థిరపడిన తర్వాతే వివాహ బంధంలోకి అడుగుపెట్టాలనే అభిప్రాయం యువతలో బలపడింది. దీంతో దేశంలో పురుషులు, మహిళల సగటు వివాహ వయసు గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగినట్లు తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. సంబంధాలు చూసే విధానంలో కూడా భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు బంధువులు, పరిచయస్తుల ద్వారా సంబంధాలు చూసేవారు. ఇప్పుడు డిజిటల్ విధానాలు,...