Pune murder case: మళ్లీ పురుషుల హక్కులపై వేడెక్కిన చర్చ
Pune murder case: పూణేలో జరిగిన కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన నేపథ్యంలో ఈ వ్యవహారం ఇప్పుడు పార్లమెంట్‌లోనూ చర్చనీయాంశంగా నిలిచింది. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కేతన్ అగర్వాల్‌ను అతని కాబోయే భార్య సియా గోయల్ అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. దర్యాప్తు వివరాల ప్రకారం జూన్ 18న చారిత్రాత్మక లోహగడ్ కోట అంచు నుంచి లోయలోకి తోసివేసి కేతన్‌ను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ హత్యకు సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరిని కూడా భాగస్వామిని చేసినట్లు వెలుగులోకి రావడంతో ఈ కేసు మరింత సంచలనంగా...