Horror: ఓటీటీలో హారర్ సినిమా రచ్చ.. ఒంటరిగా చూడాలంటే గుండె ధైర్యం ఉండాల్సిందే..
Horror: ప్రపంచవ్యాప్తంగా హారర్ చిత్రాలకు ప్రత్యేక స్థానం ఉన్నప్పటికీ, భయానక కథలను అత్యధికంగా ఆదరించే ప్రేక్షకుల్లో అమెరికా ముందంజలో ఉంటుంది. ప్రతి వారం అక్కడ కొత్త హారర్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. అలాంటి చిత్రాల్లో ఎలాంటి భారీ అంచనాలు లేకుండా విడుదలై ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యంత భారీ లాభాలను ఆర్జించిన చిత్రంగా నిలిచిన ‘పారానార్మల్ యాక్టివిటీ’ ఇప్పుడు మరోసారి ఓటీటీ వేదికలపై సంచలనం సృష్టిస్తోంది. ఎన్నో సంవత్సరాల క్రితం విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం కూడా ప్రేక్షకులను భయపెడుతూ డిజిటల్ వేదికల్లో అత్యధికంగా వీక్షించబడుతున్న చిత్రాల్లో ఒకటిగా నిలుస్తోంది. భయానక చిత్రాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఇప్పటికీ ప్రత్యేక అనుభూతిని అందిస్తోందని...