Andhra Pradesh: రుషికొండ భవనాలను ఏం చేయబోతున్నారో తెలుసా..?
Andhra Pradesh: విశాఖలోని రుషికొండ కొండపై నిర్మించిన విలాసవంతమైన భవనాల వినియోగంపై నెలల తరబడి కొనసాగుతున్న ఉత్కంఠకు త్వరలోనే ముగింపు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో నిర్మితమైన ఈ భవనాలు అప్పట్లోనే రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు కారణమయ్యాయి. అనంతరం ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఈ నిర్మాణాల భవిష్యత్తు ఏమిటన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేకపోవడంతో వివిధ స్థాయిల్లో చర్చలు సాగాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటనల సమయంలో బస చేసేందుకు ఈ విలాసవంతమైన భవనాలను నిర్మించారంటూ అధికార పక్షం విమర్శలు చేసిన నేపథ్యంలో, ఇప్పుడు వాటిని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎలా వినియోగించాలనే అంశంపై కూటమి...