Gas Connection: గ్యాస్ సిలిండర్ చోరీ అయితే ఏం చేయాలో తెలుసా..?

Gas Connection: ఇటీవలి కాలంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడంతో గృహ వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఇటీవల కొంత తగ్గుదల కనిపించినప్పటికీ, గృహ వినియోగ సిలిండర్ల ధరల్లో పెద్దగా మార్పు లేకపోవడంతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ చోరీకి గురైనా లేదా అనుకోకుండా పోగొట్టుకున్నా ఏం చేయాలి? గ్యాస్ కనెక్షన్ రద్దవుతుందా? కొత్త సిలిండర్ ఎలా పొందాలి? అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. అయితే సిలిండర్ పోయినంత మాత్రాన గ్యాస్ కనెక్షన్ రద్దు కాదు. అలాగే భవిష్యత్తులో గ్యాస్ సరఫరా కూడా నిలిపివేయరు. అయితే వినియోగదారులు నిర్దేశించిన...