Train Stunt: పిచ్చి పీక్స్.. ప్రాణాలకే రిస్క్.. (Video)
Train Stunt: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ప్రభావం యువతపై ఊహించని స్థాయిలో పెరిగింది. ముఖ్యంగా రీల్స్ కోసం కొందరు చేస్తున్న సాహసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎక్కువ లైకులు, వ్యూస్ సంపాదించి ఒక్కసారిగా గుర్తింపు పొందాలనే ఆలోచనతో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రమాదకర విన్యాసాలకు పాల్పడుతున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి ప్రయత్నాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు జరిగినప్పటికీ కొందరిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. తాజాగా కదులుతున్న రైలులో ఒక యువకుడు చేసిన ప్రమాదకర స్టంట్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో విస్తృతంగా వైరల్ అవుతోంది. కేవలం 11 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఆ యువకుడు వేగంగా...