Pm Surya Ghar: 300 యూనిట్ల వరకు పేదలందరికీ ఉచిత విద్యుత్..
Pm Surya Ghar: దేశంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు విద్యుత్ ఖర్చు భారం తగ్గించడంతో పాటు పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం పీఎం సూర్య ఘర్ మఫ్త్ బిజిలీ యోజన. 2024 ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇంటి పైకప్పుపై సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం భారీ సబ్సిడీ అందిస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలు ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రయోజనం పొందే అవకాశం ఉంది. విద్యుత్ బిల్లులను తగ్గించుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు...