Yoga Benefits: ప్రతిరోజూ ఉదయాన్నే 10 నిమిషాలు చాలు..!

Yoga Benefits: రోజువారీ జీవితంలో ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండేందుకు గంటల తరబడి వ్యాయామం చేయాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజు కేవలం 10 నిమిషాల పాటు యోగా సాధన చేసినా శరీరం, మనస్సుపై విశేషమైన సానుకూల ప్రభావం కనిపిస్తుందని సూచిస్తున్నారు. వేల ఏళ్ల చరిత్ర కలిగిన యోగా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను కూడా అందించే సమగ్ర సాధనగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా ఉదయం నిద్రలేచిన తర్వాత కొద్దిసేపు యోగా చేయడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు అవసరమైన శక్తి లభించడమే కాకుండా మెదడుకు ఆక్సిజన్ సరఫరా మెరుగుపడి ఆలోచనా సామర్థ్యం, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మరింత మెరుగుపడతాయి. బిజీ జీవితంలో...