High Court: కన్నెపొర చిరిగినంత మాత్రాన తప్పు అంటే ఎలా..?

High Court: అత్యాచార కేసుల విచారణలో బాధితురాలి వాంగ్మూలానికి ఉన్న ప్రాధాన్యాన్ని మరోసారి స్పష్టం చేస్తూ అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. బాధితురాలు ఇచ్చిన సాక్ష్యం పూర్తిగా విశ్వసనీయంగా ఉన్నప్పుడు, కేవలం వైద్య పరీక్షల్లో హైమెన్ (హైమెన్) ముందే చిరిగిపోయి ఉందనే కారణాన్ని చూపిస్తూ నిందితుడికి అనుమాన ప్రయోజనం కల్పించడం సాధ్యం కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. అత్యాచారం అనేది చట్టపరంగా నిర్వచించబడిన నేరమని, అది కేవలం వైద్యపరమైన అభిప్రాయాలతో మాత్రమే నిర్ణయించబడే అంశం కాదని ధర్మాసనం పేర్కొంది. ఈ వ్యాఖ్యలతో పాటు దాదాపు 44 ఏళ్ల క్రితం నమోదైన ఒక అత్యాచార కేసులో ట్రయల్ కోర్టు విధించిన మూడేళ్ల జైలు శిక్షను హైకోర్టు...