Indian Railways: టికెట్ తీసుకున్నా ఈ స్టేషన్‌లో ఎంట్రీ కష్టమే..!

Indian Railways: భారతదేశంలోని ప్రతి రైల్వే స్టేషన్‌కు ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే పంజాబ్‌లోని అటారీ రైల్వే స్టేషన్ మాత్రం మిగతా అన్ని స్టేషన్లతో పోలిస్తే పూర్తిగా భిన్నమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఇది కేవలం రైళ్లు ఆగే సాధారణ స్టేషన్ మాత్రమే కాదు, దేశ భద్రత, అంతర్జాతీయ సరిహద్దు పర్యవేక్షణలో అత్యంత కీలకమైన కేంద్రంగా కూడా పేరుపొందింది. సాధారణంగా ఏ రైల్వే స్టేషన్‌లోనైనా ప్రయాణ టికెట్ లేదా ప్లాట్‌ఫారం టికెట్ ఉంటే లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ అటారీ రైల్వే స్టేషన్‌లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ రైలు టికెట్ ఉన్నా సరే చెల్లుబాటయ్యే పాస్‌పోర్ట్, వీసా లేకపోతే స్టేషన్...