Telangana: మేకులు దింపిన బొమ్మ.. పక్కనే బలి ఇచ్చిన మేక.. బాబోయ్..
Telangana: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాక గ్రామ పరిధిలోని గోదావరి తీరం వద్ద ఆదివారం ఉదయం కలకలం రేగింది. నిత్యం ప్రశాంత వాతావరణంతో కనిపించే ఈ ప్రాంతంలో అనుమానాస్పద పరిస్థితులు కనిపించడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తెల్లవారుజామున నదీ తీరానికి వెళ్లిన కొందరు అక్కడ రక్తపు మరకలు, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, అలాగే ఒక బొమ్మకు మేకులు గుచ్చినట్లు కనిపించిన ఆనవాళ్లను గుర్తించారు. దీంతో అక్కడ ఏదో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం క్షణాల్లో గ్రామమంతా వ్యాపించడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు గోదావరి తీరానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటన...