Smriti Mandhana: టీ20 వరల్డ్ కప్లో హైఓల్టేజ్ మ్యాచ్
Smriti Mandhana: టీ20 ప్రపంచకప్లో భారత్ మహిళల జట్టుకు అత్యంత కీలకమైన పోరు ఆదివారం ఆస్ట్రేలియాతో జరగనుంది. సెమీ ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్లో విజయం తప్పనిసరి కావడంతో అభిమానుల దృష్టి మొత్తం ఈ పోరుపైనే నిలిచింది. ఇలాంటి కీలక సమయంలో భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన జట్టుపై పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఆస్ట్రేలియా మహిళల జట్టుతో పోలిస్తే భారత్ వెనుకబడిందనే అభిప్రాయం ఉండేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఆమె అన్నారు. గత కొన్నేళ్లలో భారత మహిళల క్రికెట్ గణనీయంగా అభివృద్ధి చెందిందని, ప్రస్తుతం ప్రపంచంలోని ఏ బలమైన జట్టునైనా ఓడించే సామర్థ్యం తమకు...