Rythu Bharosa: రైతులకు రేవంత్ సర్కార్ గుడ్న్యూస్
Rythu Bharosa: తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. రైతు భరోసా పథకం కింద కొత్తగా అర్హత పొందిన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. ఇటీవల భూములు కొనుగోలు చేసి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది. ఈ నెల 15వ తేదీలోపు భూముల రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని పట్టాదారు హక్కులు పొందిన రైతులు మాత్రమే ఈ విడతకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకోసం జులై 5 వరకు గడువు నిర్ణయించగా, ఆ తేదీలోపు తప్పనిసరిగా దరఖాస్తు సమర్పించాలని సూచించింది. జులై 5 తర్వాత దరఖాస్తులు సమర్పించిన వారికి...