Andhra Pradesh: అధిక ఫీజులకు చెక్.. అనుమతి లేకుండా ఫీజులు పెంచితే కఠిన చర్యలు
Andhra Pradesh: ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్ సీజన్ ప్రారంభమైనప్పుడల్లా ఫీజుల భారం తల్లిదండ్రులను కలవరపెడుతుందనే విమర్శలు ఎన్నో ఏళ్లుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ట్యూషన్ ఫీజులతో పాటు పుస్తకాలు, యూనిఫాంలు, రవాణా, ఇతర ప్రత్యేక రుసుముల పేర్లతో అధిక మొత్తాలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు తరచూ వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల వ్యవస్థను క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఫీజులపై పారదర్శకత తీసుకురావడంతో పాటు తల్లిదండ్రులపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా కొత్త నియంత్రణ విధానానికి రూపకల్పన జరుగుతోంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు అధికారులు సిద్ధం చేసిన ముసాయిదాపై ప్రస్తుతం విస్తృతంగా చర్చ...